
సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా విశాఖపట్టణం–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. విశాఖ–తిరుపతి (08501 /08502)స్పెషల్ ట్రైన్ నవంబర్ 6, 13, 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీ ల్లో రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12కు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. తిరిగి నవంబర్ 7, 14, 21, 28, డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 4.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50కి విశాఖ చేరుకుంటుంది.