సబ్సిడీ ‘ఉల్లి’ రెడీ | Sold out tomorrow | Sakshi
Sakshi News home page

సబ్సిడీ ‘ఉల్లి’ రెడీ

Aug 4 2015 3:03 AM | Updated on Sep 3 2017 6:43 AM

ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో బుధవారం నుంచి రూ.20కే కిలో ఉల్లిగడ్డ రారుుతీపై

రేపటి నుంచి విక్రయాలు
వీడియో కాన్ఫరెన్స్‌లో  కలెక్టర్ వాకాటి కరుణ వెల్లడి

 
హన్మకొండ అర్బన్ : ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో బుధవారం నుంచి రూ.20కే కిలో ఉల్లిగడ్డ రారుుతీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. సోమవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్టు, జేసీలతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి విక్రయాలు, ఇసుక రవాణా, ప్రాజెక్టుల భూసేకరణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్సిడీపై ఉల్లిగడ్డల అమ్మకాల కోసం పట్టణంలో ఐదు రైతు బజార్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రెండు కిలోల ఉల్లిగడ్డ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చేనెల వరకు ఉల్లి ధరలు తగ్గే పరిస్థితి లేనందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రధాన  రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు..
 జిల్లాలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం ముందస్తుగా అగ్రిమెంట్లు చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూ చించారు. జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ యార్డు ఏర్పాటు చేయాలని తద్వారా చిన్న చిన్న అవసరాలకు ప్రజలకు ఇ బ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. ఇసుక అక్రమ ర వాణా నిరోదానికి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆర్టీ, మై నింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
 
6 వేల ఎకరాల భూసేకరణ
 జిల్లాలో 6 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జేసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నెల ఆఖరునాటికి జిల్లాలో వేరుు ఎకరాల భూమి సేకరించాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మైనింగ్ ఎండీ, డిప్యూటీ కలెక్టర్లు డెవిడ్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement