ఆల్‌టైమ్‌ హై రికార్డు

In six monthsThe Revenue Of Registrations Crossed Rs 3000 Crore - Sakshi

సెపె్టంబర్‌ చివర్లో దుమ్మురేపుతున్న రిజి్రస్టేషన్ల ఆదాయం

ప్రతి రోజూ సగటున 5 వేల రిజి్రస్టేషన్లు, రూ.20 కోట్లకు పైగా ఆదాయం

ఈ ఏడాది ఇప్పటికే రూ.3,118 కోట్లు ఆర్జించిన రిజి్రస్టేషన్ల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగియక ముందే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.3 వేల కోట్లు దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ఆరు నెలల్లో రూ.2 వేల కోట్ల లోపు ఆదాయానికే పరిమితమైన రిజి్రస్టేషన్ల ఆదాయం ఈ ఏడాది ఆల్‌టైమ్‌ హై రికార్డుతో రూ.3,118 కోట్లకు చేరింది. ఆరు నెలలు ముగిసేందుకు మరో వారం రోజుల గడువు మిగిలి ఉండగానే ఈ రికార్డు సాధించడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్‌ మాసం దుమ్మురేపుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఆదాయం రూ.398 కోట్లు దాటిపోయింది. ఈ నెల 13కి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.2,951 కోట్ల పైచిలుకు ఉండగా, 25కి అది రూ.3,118 కోట్లకు చేరింది.

మొత్తం 12 రోజుల్లో (రెండు ఆదివారాలు, వినా యక నిమజ్జనం) సెలవులు పోను 9 రోజుల్లోనే రూ.167 కోట్ల ఆదాయం వచి్చంది. సగటున రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, 5 వేలకు పైగా డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రిజి్రస్టేషన్‌ జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయంలో సగం రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచే వస్తోంది. యాదాద్రి జిల్లాలోనూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం వచి్చంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం తక్కువ ఉన్న జిల్లాల్లో కొమురం భీం, జయశంకర్, భద్రాద్రి జిల్లాలున్నాయి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top