రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌రెడ్డి | singireddy niranjan reddy appointed telangana planning commission vc | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌రెడ్డి

Dec 16 2014 3:12 AM | Updated on Sep 2 2017 6:13 PM

రాష్ట్రంలో పదవుల పందేరాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేగవంతం చేశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవుల పందేరాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేగవంతం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇక ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించాలని నిర్ణయించిన సీఎం ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావును ప్రకటించగా... తాజాగా కోవ లక్ష్మి(ఆసిఫాబాద్), దాస్యం వినయ్‌భాస్కర్ (హన్మకొండ) పేర్లను ఖరారు చేశారు. మరో ఇద్దరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement