‘కిట్స్’లో కెవ్వు కేక | Singer Bollywood Hungama | Sakshi
Sakshi News home page

‘కిట్స్’లో కెవ్వు కేక

Apr 3 2015 12:40 AM | Updated on Apr 3 2019 7:03 PM

బాలీవుడ్ సింగర్లు సాంగేశారు.. కళాశాల విద్యార్థులు కేక పెట్టారు..

బాలీవుడ్ సింగర్‌ల హంగామా
స్టెప్పులతో అదరగొట్టిన జన్‌ప్రీత్, జీజే సింగ్
కాలు కదిపిన కాలేజీ కుర్రాళ్లు

 
భీమారం : బాలీవుడ్ సింగర్లు సాంగేశారు.. కళాశాల విద్యార్థులు కేక పెట్టారు.. ఇంకేముంది ప్రాంగణమంతా ఈలులు.. కేరింతలతో సందడే సందడి.. నగర పరిధిలోని కిట్స్ కళాశాలలో సంస్కృతి-15లో ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ సింగర్ సిమ్రాన్ రశీదా తన పాటలతో కెవ్వు మనిపించారు. ‘ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే’ అని పాటను ప్రారంభించగా.. విద్యార్థులు స్వరం కలిపారు.

‘తేరి గలియా.. ముజ్కో సతాతీహై తేరి గలియా’, ‘సినిమా చూపిస్తా... మామా... నీకూ సినిమా చూపిస్తా మామా’ అంటూ పాటలు పాడుతుండగా యువకులు ఊర్రూ తలూగారు. ‘బొంబాయిలో నేనుంటా ను..’ అంటూ జనప్రీత్ జెస్జ్, జీజేసింగ్ స్టెప్పులు వేస్తుండగా.. వేదిక బయట విద్యార్థులు వారిని అనుసరించారు. అంతకుముందు విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నారుు. ‘హమ్‌తేరే బిన్ కబీ రహనహీ సక్తే.. తేరే బినా క్యా జీనా మేరా’ అంటూ ఎంబీఏ విద్యార్థిని వారితో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement