‘సిలికా’ పరిహారంపై సుమోటో పిల్‌

silica mines Compensation in sumoto pill in high court - Sakshi

ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రి స్థలం కబ్జాపై కూడా

సాక్షి, హైదరాబాద్‌: సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారిన పడిన వారికి తగిన నష్టపరిహారం అందించాలన్న తమ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదంటూ పత్రిక ల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందిం చింది. ఈ కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్లు, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరపనుంది.

రంగారెడ్డి జిల్లాలోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం వల్ల పలువురు మృత్యువాత పడ్డా రు. దీనిపై హైకోర్టులో 2013లో పిల్‌ దాఖ లైంది. ఈ పిల్‌ విచారణ సందర్భంగా అప్ప టి అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) సిలికా బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరోవైపు ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో ఉస్మానియా ఆస్పత్రికి ఉన్న స్థలా న్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. దీనిపై కూడా సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top