కండిషన్‌లో లేని స్కూలు బస్సులు చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
సాక్షి, మోత్కూర్: కండిషన్‌లో లేని స్కూలు బస్సులు చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నడస్తున్న స్కూలు బస్సు టైర్ బోల్డులు ఊడిపోవటంతో స్థానికులు అప్రమత్తం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మోత్కూర్ మండల కేంద్రంలోని లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు మంగళవారం ఉదయం 60 మంది పిల్లలను తీసుకుని స్కూలుకు వెళ్తోంది. మోత్కూర్ సమీపంలో చక్రం బోల్టులు ఉడిపోయిన విషయం స్థానికులు గమనించి కేకలు వేయటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. పెద్ద ప్రమాదం తప్పటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.