
సరళాసాగర్ ప్రాజెక్టు
వనపర్తి నుంచి సిలివేరు యాదగిరి : ఏడు దశాబ్దాల క్రితమే అమెరికాలోని అధు నాతన టెక్నాలజీని తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. వనపర్తి జిల్లా మద నాపురం మండలం శంకరమ్మపేట సమీ పంలో దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రా నికి ముందే ఇక్కడ ఓ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వరరావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికా లోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చా రు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్.చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో దీన్ని పూర్తి చేశారు. 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రాజెక్టును ప్రారంభించారు.
ఆసియా ఖండంలో రెండోది
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టు లోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకో గానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకో వడం. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే రెండో ప్రాజెక్టు ఇది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్‌ను నిర్మించారు. ఒక్కో సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడువు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 ఫీట్లు, నికర నీటి నిలువ 22 అడుగులు, 491.37 ఎంసీఎఫ్‌టీ, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడి కాలువ 8 కి.మీ., ఎడమ కాలువ 20 కి.మీ.లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి.
సాగునీరే లక్ష్యంగా..
పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా రైతులకు సాగు నీరు అందకపోవడంతో 0.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 11 గ్రామాల పరిధిలోని ఆరు వేల ఎకరా లకుపైగా సాగునీరు అందుతుంది. రామన్‌పాడ్ బ్యాక్ వాటర్ నుంచి తిర్మలాయపల్లి సమీపంలో సరళాసాగర్‌కు లిఫ్ట్ ఏర్పాటు చేశారు. శంకరస ముద్రం నుంచి కాలువ ద్వారా సరళాసాగర్‌కు నీరు రావడానికి అవకాశం ఉంది. ఈ కాల్వను పెద్దగా చేసి నీటి ప్రవాహాన్ని పెంచే అవకాశం ఉన్నా అధికారులు పరిశీలించడం లేదు.
అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతం..
జూరాలలో నీరున్న సమయంలో సరళాసాగర్‌కు వదిలినట్లయితే నీటిమట్టం పెరగగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా తెరుచుకున్న సమ యంలో చూడడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు. కానీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించ డం లేదు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.