కరీంనగర్ జల్లా ముస్తాబాద్ మండలంలో రైతులపై ఇసుక మాఫియా దాడులకు దిగింది.
ముస్తాబాద్: కరీంనగర్ జల్లా ముస్తాబాద్ మండలంలో రైతులపై ఇసుక మాఫియా దాడులకు దిగింది. మండలంలోని కొండాపూర్ గ్రామం సమీపంలో మానేరు వాగు నుంచి కొంత కాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా వాగు వద్ద రైతులు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఇసుకను తీయటానికి వీల్లేదన్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. అడ్డుకున్న రైతులను తీవ్రంగా కొట్టి పరారయ్యారు. ఐదుగురు రైతులు స్పృహ తప్పి పడిపోగా.. స్థానికులు వారిని గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.