చంద్రమౌళికి ‘రంగినేని’ పురస్కారం  | Rama chandra Mouli Gets Rangineni Award | Sakshi
Sakshi News home page

Dec 7 2018 2:30 AM | Updated on Dec 7 2018 2:30 AM

Rama chandra Mouli Gets Rangineni Award - Sakshi

సిరిసిల్ల: జాతీయ స్థాయిలో అందించే రంగినేని ఎల్లమ్మ స్మారక సాహిత్య పురస్కారానికి వరంగల్‌కు చెందిన రామా చంద్రమౌళి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి చంద్రమౌళి రాసిన ‘తాత్పర్యం’కథా సంపుటికి రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని రంగినేని ట్రస్ట్‌లో 2019లో జరిగే కార్యక్రమంలో అందజేస్తారు. పురస్కారం కింద రూ.15 వేల నగదు, ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కోసం తెలంగాణ, ఏపీల నుంచి 48 కథా సంకలనాలు రాగా వాటిలో చంద్ర మౌళి రాసిన తాత్పర్యం కథా సంపుటి అవార్డుకు ఎంపికైందని అవార్డు కమిటీ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు, కన్వీనర్‌ లక్ష్మణ్‌ గురువారం వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement