అందరూ బాగున్నారా? | rakul preet singh visits siddipet to open a shopping mall | Sakshi
Sakshi News home page

Feb 19 2018 5:35 PM | Updated on Sep 2 2018 4:03 PM

rakul preet singh visits siddipet to open a shopping mall - Sakshi

అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న సినీనటి రకుల్‌ 

సిద్దిపేటజోన్‌: ‘అందరికీ నమస్కారం. అంతా బాగున్నారా? నేను మీ హీరోయిన్‌ రకుల్‌ని. మాంగళ్య థర్ట్‌ స్టోర్‌ ఇది. మాల్‌లో శారీస్‌ చాలా బాగున్నాయి. న్యూబర్న్‌ నుంచి అందరికీ కావాల్సిన మెటీరియల్‌ఉంది.’ అంటూ ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సిద్దిపేట ప్రజలను అలరించారు. మాంగళ్య షాపింగ్‌ మెగామాల్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. రకుల్‌ వస్తుందన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో షాపింగ్‌ మాల్‌కు చేరుకున్నారు.

జనం తాకిడీ ఎక్కువగా ఉండటంతో మాల్‌లోకి వీఐపీలు, మీడియాను మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో పాత మార్కెట్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. కంచిపట్టు చీర ధరించిన రకుల్‌.. భారీ పోలీసు బందోబస్తు మధ్య షాపింగ్‌మాల్‌ ప్రారంభించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటి వరకు సపోర్ట్‌ ఇచ్చిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్‌. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి అంటూ కోరారు. అనంతరం షాపింగ్‌ మాల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారీ సెక్షన్‌తో పాటు పలు విభాగాలను పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement