సీఓడీ..డిలే!

Production In KTPS 7th Phase Is Stoped - Sakshi

కేటీపీఎస్‌ 7వ దశలో ఉత్పత్తికి అవాంతరాలు

పరిష్కారంపై దృష్టి సారించిన అధికారులు

బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీతో పూర్తిగా నిలిచిన వైనం

ఎన్నికల తర్వాతే జాతికి అంకితం   

పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేటీపీఎస్‌ 7వ దశలో విద్యుత్‌ ఉత్పత్తికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనులు శరవేగంగా జరిగినప్పటికీ ఉత్పత్తి మాత్రం అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. 800 మెగావాట్ల బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా నాలుగు రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. అంతేగాక గత అక్టోబర్‌లోనే సీవోడీ(కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) చేస్తామని ప్రకటించినప్పటికీ.. నవంబర్‌లో కూడా చేస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. పూర్తిస్థాయి ఉత్పత్తి వస్తేనే సీఓడీకి వెళతామని అధికారులు చెపుతున్నారు. సేఫ్టీ వాల్స్‌ లీకులు సరిచేయడంతో పాటు బాయిలర్, సిస్టమ్‌ లోడింగ్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 11 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా...  
తెలంగాణ ఏర్పడక ముందు 6,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగా, ఆ తర్వాత ఓసీ–2లో 120 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడ జీ–13, జీ–8 బొగ్గు గ్రేడ్లు పుష్కలం. జీ–13 ఉత్పత్తి ఎక్కువ. నెలకు 3.8 లక్షల టన్నుల బొగ్గు లభిస్తోంది. జేవీఆర్‌ ఓసీ–1, జేవీఆర్‌ ఓసీ–2ల నుంచి ప్రతిరోజూ 550నుంచి 700 లారీ ల వరకు బొగ్గు రవాణా జరుగుతోంది. 30 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గనుల విస్తరణతో వచ్చే రెండు మూడేళ్లలో సత్తుపల్లి కేంద్రంగా జీఎం కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 25 ఎకరాల్లో సింగరేణి కా ర్మికుల క్వార్టర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
  
షేప్‌ నిధుల్లేవు.. పర్యావరణం పట్టదు.. 

జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ ఏర్పాటప్పుడు ప్రభావిత గ్రామాలైన.. రేజర్ల, కిష్టారం అభివృద్ధికి సింగరేణి నుంచి షేప్‌ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ 13 ఏళ్ల కాలంలో కేవలం రూ.5కోట్లు మాత్రమే ఇచ్చారు. అవి కూడా ప్రాధాన్యతా ప్రకారం మంజూరు చేయలేదనే విమర్శలున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటనలు చేసినా.. ఇప్పటివరకు విడుదల చేయలేదు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. బొగ్గు తవ్వకాలు చేపట్టక ముందు పచ్చదనంతో కళకళలాడిన సత్తుపల్లి పరిసరాల్లో ఇప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఏడాదికి లక్ష మొక్కలు నాటిస్తాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు రూ.15లక్షల విలువైన 65 వేల మొక్కలనే నాటినట్లు సంస్థ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. పలుమార్లు మొక్కలు నాటాలంటూ సత్తుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆందోళనకు దిగిన సంఘటనలు ఉన్నా.. యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.
 
బాంబు బ్లాస్టింగ్‌లతో దడ.. 
బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో చేపట్టే బాంబు బ్లాస్టింగ్‌ వల్ల ఏడు కిలోమీటర్ల వరకు గ్రామాల్లోని నిర్మాణాలపై ప్రభావం పడుతోంది. దీంతో.. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చి దెబ్బ తింటున్నాయి. 3 గంటల నుంచి 3.30 వరకు జరిగే పేలుళ్లతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఒక్కోసారి అధిక మోతాదుతో భూమి కంపిస్తోందని, ఓసీ–2 సమీపంలోని ఎన్టీఆర్‌ కాలనీలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఆందోళనలు చేసి.. సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు కూడా.
  
ఉసురు తీస్తున్న బొగ్గు లారీలు.. 
సత్తుపల్లి నుంచి కొత్తగూడెం గౌతంఖనికి రోడ్డుమార్గంలో నిత్యంలారీల్లో బొగ్గును సరఫరా చేస్తు న్నారు. వందలాది టిప్పర్లు తిరుగుతుండడంతో విపరీతమైన దుమ్ము లేచి వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పెద్దపెద్ద బొగ్గు పెళ్లలు జారి పడుతున్నాయి. అధిక లోడు, మితిమీరిన వేగంతో రవాణా కారణంగా ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 132 మంది మృత్యువాత పడ్డారు. 87 మంది క్షతగాత్రులైనట్లు పోలీసుల విచారణలో తేలింది. 2019కల్లా బొగ్గు రవాణా కోసం రైల్వేలైన్‌ పనులు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ.. భూసేకరణ ప్రక్రియ మాత్రమే ముగిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top