పోలీసుల అదుపులో ‘ప్రత్యామ్నాయ’ నేతలు | Police to arrest Alternative political platform leaders | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ‘ప్రత్యామ్నాయ’ నేతలు

Sep 21 2014 2:59 AM | Updated on Sep 17 2018 5:17 PM

నగరంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సుకు వచ్చిన కళాకారులు, విరసం నేతలను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సుకు వచ్చిన కళాకారులు, విరసం నేతలను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్కత్‌పురలోని తుల్జాభవన్‌లో రాత్రి బస చేసిన విరసం నేత వరలక్ష్మి, పాణి, అమరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మకుమారి, జార్ఖండ్‌కు చెందిన ప్రజా కళాకారుడు జీతన్ మరాండీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వేదిక ఆదివారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సదస్సుకే పరిమితమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement