గుడిసెలు దహనం చేసిన పోలీసులు | police burn down huts | Sakshi
Sakshi News home page

గుడిసెలు దహనం చేసిన పోలీసులు

Apr 20 2015 3:32 AM | Updated on Aug 21 2018 5:46 PM

పట్టణ శివారులోని నర్సంపేట రోడ్డులో పదెకరాల భూమిలో సీపీఎం ఆధ్వర్యంలో పేదలు 200కుపైగా గుడిసెలు వేశారు.

ముగ్గురు సీపీఎం నాయకులపై కేసు నమోదు

మహబూబాబాద్ : పట్టణ శివారులోని నర్సంపేట రోడ్డులో పదెకరాల భూమిలో సీపీఎం ఆధ్వర్యంలో పేదలు 200కుపైగా గుడిసెలు వేశారు. కాగా ఆ భూయజమాని గంగుల సంజీవరెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి  వేసిన గుడిసెలను తొల గించారు. ఆ గుడిసెలన్నింటిని కిరోసిన్ పోసి దహ నం చేశారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ దళారుల మాటలు నమ్మి అమాయకులు నష్టపోతున్నారన్నారు.

కొందరు నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దందాలకు పాల్పడుతున్నారన్నారు. భూముల్లో గుడిసెలు వేస్తే ఎవ రినీ ఉపేక్షించేది లేదన్నారు. నర్సంపేట రోడ్డులో పేదలతో గుడిసెలు వేయించిన సీపీఎం నాయకులు బానోత్ సీతారామ్ నాయక్, ఆర్.రాజు, సిజ్జిరామ్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఇల్లందు రోడ్డులోని మానుకోటకు చెందిన పమ్మి సనాతనచారి భూమిలోనూ గుడిసెలు వేస్తే వాటిని తొలగించి అందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సీఐ వెంట ఆర్‌ఐ తిరుపతి, ఎస్సై సతీష్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement