ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
పేకాట స్ధావరాలపై పోలీసుల దాడులు
Dec 14 2015 10:19 AM | Updated on Aug 21 2018 5:52 PM
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని దుగినేపల్లిలోని పేకాటస్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో సోదాలు జరిపిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.12, 500 లు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మంది పేకాట రాయుళ్లు పరారైయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి గాలింపు చేస్తున్నారు.
Advertisement


