కేసీఆర్‌ మోసాలను చూసే కాంగ్రెస్‌లోకి చేరికలు | Peoples Join In Congress Party | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మోసాలను చూసే కాంగ్రెస్‌లోకి చేరికలు

Apr 4 2018 10:53 AM | Updated on Mar 18 2019 9:02 PM

Peoples Join In Congress Party - Sakshi

కాంగ్రెస్‌లో చేరుతున్న నాయకులు

తిప్పర్తి : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీసీసీబీ డైరెక్టర్‌ సంపత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పజ్జూరులో పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజ లను మోసపూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పలు అభివృ ద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సిం గం సత్తయ్య, మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, ఎంపీటీసీ కి న్నెర అంజి, దొంతినేని నాగేశ్వర్‌రావు, సురిగి రామకృష్ణ, జంజారాల సైదులు, దొడ్డ సోమయ్య, కస్పరాజు అయోధ్య, పల్లెసైదులు, భాస్కర్, ఆనందం, లింగస్వామి, యాదగిరి, బాలయ్య, భి క్షం, నర్సింహ, వార్డు సభ్యులు పల్లె సైదులు, నాగమ్మ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement