కేన్సర్‌కు చెక్‌!

Patent to IICC on preparation of disease Cancer drugs - Sakshi

వ్యాధి నివారణ ఔషధాల తయారీపై ఐఐసీటీకి పేటెంట్‌  

ఐదేళ్లలో అందుబాటులోకి మందులు

తార్నాక: కేన్సర్‌ ఓ ప్రాణాంతకమైన మహమ్మారి. ఈ వ్యాధి నిర్మూలనకు మందులే కాని పూర్తి స్థాయి నివారణ చికిత్స లేదు. కేన్సర్‌ నివారణ కోసం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 100 రకాల మందులు ఉన్నా వాటితో వ్యాధి తగ్గకపోగా అనేక రకాలుగా నష్టం కలుగుతోంది. ఇప్పుడున్న మందులు వాడటంతో రోగి శరీరం పూర్తిగా విషపూరితంగా మారుతోందని.. కేన్సర్‌ కణాల నివారణకు వాడే మందులు శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలను కూడా నాశనం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ద ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం కేన్సర్‌ వ్యాధి నివారణ మందుల తయారీకి అవసరమైన ఫార్ములాను రూపొందించింది. ఇవి కేన్సర్‌ సోకిన కణాలను మాత్రమే నాశనం చేస్తాయని, రోగి శరీరంలోని ఇతర కణాలకు ఎలాంటి హాని జరగదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఐఐసీటీ, నానోదేవ్‌ థెరపిటిక్‌ సంస్థల ప్రతినిధులు అమెరికాలోని మాయో క్లినికల్‌ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందంతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఐఐసీటీ అవగాహన ఒప్పందం..
కేన్సర్‌ వ్యాధి మందుల తయారీకి అమెరికాలోని మాయో క్లినిక్, భారత్‌లోని నానోదేవ్‌ థెరపిటిక్‌ (ఎన్‌డీటీ)తో  2011లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కేన్సర్‌ మందుల తయారీని పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన ఐఐసీటీ అప్పటికే కేన్సర్‌ వ్యా«ధులపై పరిశోధనలు చేస్తున్న ఎన్‌డీటీ సంస్థ ఇచ్చిన లిపిడ్‌ ఫార్ములాతో పరిశోధనలు చేశారు. ఐఐసీటికి చెందిన రాజ్‌కుమార్‌ బెనర్జీ, సురేందర్‌రెడ్డి, సునిల్‌ మిశ్రా, కుమార్‌ప్రణవ్‌ నారాయణ్‌ (బిట్స్‌) శాస్త్రవేత్తల బృందం ఆరేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో భాగంగా పాంక్రియాటిక్‌  కేన్సర్, రొమ్ము క్యాన్సర్, మెలనోమా, లుకేమియా వంటి వ్యాధులకు సంబంధించి జంతువులపై ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. లిపిడ్‌ ఫార్ములాతో తయారైన ఈ మందును కేన్సర్‌ సోకిన కణంపైకి పంపించి దానిని ఉత్తేజపరుస్తారు. మందు ప్రభావంతో కేన్సర్‌ కణం పూర్తిగా నశించి దాని పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై ఐఐసీటీ పేటెంట్‌ కూడా పొందింది.

ఎన్‌డీటీకి మందుల తయారీ బాధ్యతలు..
ఇలా ప్రీ క్లినికల్‌ ట్రాయల్స్‌ నిర్వహించిన ఐఐసీటీ ఈ మందులకు సంబంధించిన ఫార్ములాపై  పేటె ంట్‌ పొందింది. ఇక అసలైన మందుల తయారీ బాధ్యతలను భారత్‌లోని నానోదేవ్‌ థెరపిటీక్‌ (ఎన్‌డీటీ) పరిశోధనా సంస్థకు అప్పగించింది. పేటెంట్‌పై రెండు సంస్థల మధ్య  మంగళవారం కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. 18 నెలల్లో క్లినికల్‌ ట్రయ ల్స్, 5 ఏళ్లలో మార్కెట్‌లోకి కేన్సర్‌ నివారణ మం దులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top