‘పాలమూరు సాండ్‌’తో రూ.14 కోట్లు

palamuru sand in online : collector ronald ross - Sakshi

ఆన్‌లైన్‌లో ఇసుకబుక్‌ చేస్తే డోర్‌ డెలివరీ

తక్కువ ధరకేనాణ్యమైన ఇసుక

అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు : కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌:  ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ‘పాలమూరు ఇసుక(పాలమూరు సాండ్‌)’ పాలసీ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ వెల్లడించారు. కలెక్టర్‌ రెవెన్యూ సమావేశంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలసీ వివరాలను వెల్లడించారు. అవసరాల నిమిత్తం ఎవరికైనా ఇసుక కావాలంటే ఆన్‌లై లేదా మీసేవా కేంద్రాల్లో బుక్‌ చేస్తే ద్వారా తక్కువధరకే నాణ్యమైన ఇసుక ఇంటికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు 15న పాలమూర్‌ స్యాండ్‌ పాలసీని ప్రారంభించగా.. ఇప్పటివరకు జిల్లాకు రూ.14 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. బుక్‌ చేసుకున్న 46,846 ట్రిప్పుల్లో 39,590(92 శాతం) ట్రిప్పుల ఇసుక సరఫరా చేశామన్నారు. జిల్లాలో మూడు పట్టా భూముల్లోని రీచ్‌లు, ప్రభుత్వం గుర్తించిన ఆరు ఇసుక రీచ్‌ల నుండి ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి డోర్‌ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. 

అవినీతికి తావు లేదు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పాలమూర్‌ ఇసుక స్యాండ్‌ పాలసీని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ వెల్లడించారు. ఈ పాలసీ అమలులో అక్రమాలు చోటు చేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రూ.4500 నుండి రూ.6 వేల వరకు ట్రిప్పు ఇసుక ఈ పాలసీ ద్వారా ప్రజలకు దూరాన్ని బట్టి రూ.2,800 నుండి రూ.3,600 వరకు అందుతోందని తెలిపారు. ఈ మేరకు అవసరమున్న వారు  ఠీఠీఠీ. p్చl్చఝౌౌటట్చnఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకుంటే ట్రాక్టర్లు, ట్రిప్పర్ల ద్వారా నేరుగా ఇంటికే ఇసుక సరఫరా చేస్తామని వివరించారు. ప్రజల అవసరాల మేరకు అమలు చేస్తున్న స్యాండ్‌ పాలసీకి ప్రజల నుండి ప్రోత్సాహం అవసరమని.. అక్రమ ఇసుక రవాణా, కృత్రిమ ఇసుకను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్రభుత్వ పనులకు సైతం పాలమూర్‌ స్యాండ్‌ పాలసీ ద్వారానే ఇసుక సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పేర్కొన్నారు.   

32 కేసుల నమోదు
జిల్లాలో పాలమూర్‌ స్యాండ్‌ పాలసీ ప్రారంభించినప్పటి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ మేరకు ఇప్పటివరకు జిల్లాలో 32 కేసులు నమోదు చేసి 52 మందిని అరెస్టు చేశాని, 38 వాహనాలను సీజ్‌ చేశామని వెల్లడించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జి జేసీ కృష్ణాదిత్య, ఆర్డీఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top