ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం ఓ కారు దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం..
శంషాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం ఓ కారు దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లివాసి సత్యనారాయణరెడ్డి సంక్రాంతి పండుగ కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వె ళ్లి ఉదయం కారులో కుటుంబ సమేతంగా తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాళ్లగూడ సమీపంలోకి చేరుకోగానే కారు ఇంజిన్‌లోంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సత్యనారాయణరెడ్డి కుటుంబీకులతో పాటు కారులోంచి దిగాడు. కొద్ది క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆర్‌జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.