ఓసీ హక్కుల సాధనకు ఉద్యమిద్దాం | oc to exercise those rights to fight | Sakshi
Sakshi News home page

ఓసీ హక్కుల సాధనకు ఉద్యమిద్దాం

Feb 27 2016 1:53 AM | Updated on Sep 3 2017 6:29 PM

ఓసీ హక్కుల సాధనకు ఉద్యమిద్దాం

ఓసీ హక్కుల సాధనకు ఉద్యమిద్దాం

ఓసీ కులస్తుల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు ఉద్యమానికి సిద్ధం కావాలని ఓసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ....

ఓసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున్‌రెడ్డి

 హుస్నాబాద్ :  ఓసీ కులస్తుల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు ఉద్యమానికి సిద్ధం కావాలని ఓసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి కోరారు. హుస్నాబాద్‌లో శుక్రవారం ఆ సంఘం మండల అడ్‌హక్ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని కులాల్లో ఉన్నట్లుగానే ఓసీల్లోను కడు పేదలు ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను పేద ఓసీలకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓసీల హక్కుల సాధనకు త్వరలో సిరిసిల్లలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొండ్లె హన్మంతరెడ్డి, దొమ్మాటి భద్రయ్య, ఆలేటి కొండాల్‌రెడ్డి, అయిలేని శంకర్‌రెడ్డి, కొండ్లె రాజు, పెద్ది రవీందర్, ఆంజనేయులు పాల్గొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement