‘కోడ్‌’కూసినా..

Not follow Elections Code  Implementation Nalgonda - Sakshi

సాక్షి, యాదాద్రి : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమల్లోకి వచ్చినా పూర్తి స్థాయిలో జరగడం లేదు. మూడు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సం ఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కోడ్‌ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిం దని, పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆశించిన స్థాయిలో అమలు జరగడం లేదు. ప్రధానంగా రాజకీయ పార్టీలు భారీ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులు, గోడలపై రాజకీయ పార్టీల ప్రచార హోరు కొనసాగుతూనే ఉంది.

వెనక్కి రాని ఉద్యోగులు,ఉపాధ్యాయులు!
ఎన్నికల కోడ్‌ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చి నందున తాజా మాజీ ఎమ్మెల్యేల వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెనక్కి రావాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వెనక్కి వచ్చినప్పటికీ సెలవుపై వారి వద్దే విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ని కల నిబంధనను అమలు చేయడానికి జిల్లా ఎన్ని కల అధికారులు, క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి బృందాలుగా వర్గీకరించినప్పటికీ వారు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించడం లేదు. మరో వైపు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఆయా పార్టీల అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎన్నికల సంఘం లెక్కిం చాలి. కరపత్రాలు, ఫ్లెక్సీలు వంటి వాటిని భారీ ఎత్తున ఉపయోగిస్తున్న వాటికి సంబంధించిన ఖర్చు నమోదు చేసే ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడం లేదు.

ఫ్లెక్సీలు, పోస్టర్లు ఎక్కడికక్కడే..
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ స్థలాల వద్ద గల ప్రచార సామగ్రిని తొలగించాలి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన 24గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాల్లో, 72గంటల లోపు ప్రైవేట్‌ ఆస్తులపై ప్రచార ఫ్లెక్సీలను, రాతలను, ఫొటోలను తొలగించాల్సి ఉన్నా జరగడం లేదు. ఆర్టీసీ బస్సులపై గల ఫ్లెక్సీలు, పోస్టర్లు ఎక్కడికక్కడే ఉన్నా యి. గ్రామాల్లో గోడలపై పార్టీల రాతలు తొలగింపులో జాప్యం జరుగుతుంది. అదే విధంగా యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలకు, అ ధికారులకు ఇప్పటికే ఎన్నికల కోడ్‌పై అవగాహన సమావేశాలు నిర్వహించారు. సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్‌ అమలుపై  పార్టీలతో సమావేశమై నియయావళిని వివరించారు.

కచ్చితంగా పాటించాలి
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున  రాజకీ య పార్టీలు, ప్రభు త్వ ఉద్యోగులు, పో లింగ్‌ ఏజెంట్లు అం దరూ కచ్చితంగా ని యమ, నిబంధనలు పాటించాలి.  బ్యాన ర్లు, ఆర్టీసీ బస్సులపై గల ప్రచారాలను తొలగించాలని కలెక్టర్‌ అని తారామచంద్రన్‌ ఇప్పటికే ఆశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ ఆస్తులపై గల ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, రా తలను తొలగిస్తున్నారు.ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేస్తాం.  – ఎస్‌.సూరజ్‌కుమార్, జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top