ఆ ఊళ్లో ఎన్నికల్లేవు.! 

No ST Candidate To Contest As Sarpanch In Reserved At Tejapur Asifabad - Sakshi

సర్పంచ్‌ స్థానాలకు అభ్యర్థులు కరువు

మూడు పంచాయతీల్లో ఎస్టీలు నిల్‌

ఆ షెడ్యూల్డ్‌ జీపీల్లో సర్పంచ్‌ ఎన్నిక కష్టమే

ఉప సర్పంచ్‌తో తృప్తిపడనున్న గ్రామస్తులు

సాక్షి, ఆసిఫాబాద్‌: కొత్త పంచాయతీలుగా ఏర్పడిన సంబరం ఆ గ్రామస్తులకు లేకుండా పోయిం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌ పదవి లేకుండా పోతోంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులే పూర్తిగా ఉండి అసలు గిరిజనులే లేని పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నా యి. రెండో విడత ఎన్నికలు జరిగే 107 పం చాయతీల్లో రెండు గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. అలాగే మూడో విడత ఎన్ని కలు జరిగే 114 గ్రామ పంచాయతీల పరిధిలో ఒక పంచాయతీ ఎన్నికలకు ఆటంకం కలుగుతోంది. ఈ మూడు పంచాయతీ పరిధిలోనూ ఒకటే సమస్య. ఆ గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయినప్పటికీ ఒక్క ఎస్టీ ఓటరు లేకపోవడమే. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో భవిష్యత్‌లోనూ ఈ రిజర్వేషన్లు మార్చే అవకాశం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రామాలకు సర్పంచ్‌ ఎన్నికల జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఒక్క ఎస్టీ లేరు...
పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కావడంతో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో మొత్తం 334 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో షెడ్యూ ల్డ్‌ ఏరియా పరిధిలో ఉన్నవి 162. 164 నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలోఉండగా, మరో ఎని మిది వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ మొత్తం పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే రెండో విడత ఎన్నికలు జరిగే ఆసిఫాబాద్‌ మండలం రహపల్లి, వెంకటపూర్‌ గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వు కాగా వీటిలో ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో కనీసం సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా లేకుండా పోయారు. అలాగే మూడో విడత ఎన్నికలు జరిగే వాంకిడి మండలం తేజపూర్‌ గ్రామ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా సర్పంచు స్థానానికి పోటీ  చేసేందుకు ఎస్టీలు కరువయ్యారు.

గతంలో ఈ మూడు పంచాయతీలు పాత పంచాయతీల్లో ఉండగా గిరిజనులు ఉండేవారు. కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీల్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. దీంతో సర్పంచ్‌ ఎన్నిక లేకుండా పోయిం ది. ఈ మూడు పంచాయతీల్లో ఎనిమిది చొప్పున వార్డులు ఉన్నాయి. వీటిలో వెం కటపూర్‌ గ్రామస్తులు ఎస్టీ రిజర్వేషను వచ్చినందుకు నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తు తీర్మానం చేశారు. మూడు వార్డులకు జనరల్‌కు రిజర్వు అయినప్పటికీ నామినేషన్లు ఎవరూ వేయలేదు. దీంతో ఇక్కడ పూర్తిగా ఎన్నికలే జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇక రహపల్లి, తేజపూర్‌లో ఎనిమిదింటిలో ఒక్కో పంచాయతీలో నాలుగు జనరల్‌ స్థానాలకు  చొప్పున కావడంతో ఈ వార్డులకు నామినేషన్లు రావడంతో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు పంచాయతీల్లో నాలుగింటిలో ఎన్నిక జరిగితే ఒక ఉప సర్పంచ్‌ ఎన్నిక జరిగే అవకాశముంది.
 
ఉపసర్పంచ్‌ కోసం భారీ పోటీ..
ఎలాగు సర్పంచ్‌ అభ్యర్థులు లేకపోవడంతో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఉప సర్పంచ్‌గానైనా గ్రామంలో చక్రం తిప్పుదామని కొంత మంది ఆశావావహులు ఆరాట పడుతున్నారు. ఇందు కోసం తనతో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులను తన వైపు చేర్చుకుంటే ఉపసర్పంచ్‌ పదవి దక్కే అవకాశముందని భావించి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచ్‌ పదవి ఎలాగు దక్కే అవకాశం లేకపోవడంతో ఉపసర్పంచ్‌ పదవి కైవసం చేసుకునేందుకు బేరాసారాలు ప్రారంభమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 

మార్చాలని కోరాం
మా గ్రామంలో ఒక్కరు కూ డా ఎస్టీ ఓటరు లేరు. కాని పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వు అయింది. దీనిపై కలెక్టర్‌ను కలిసి రిజర్వేషన్‌ మార్చాలని కోరాం. అయితే ఎస్టీ రిజర్వేషన్‌ మార్పు మా పరిధిలో లేదని తెలిపారు. దీంతో భవిష్యత్‌లో ఎన్నికలు జరుగుతాయా అనేది అనుమానంగా ఉంది. – చెండి సోమేశ్వర్, మాజీ ఎంపీటీసీ, గాట్‌ జనగాం, తేజపూర్‌

ఒక్క ఎస్టీ ఓటరు లేరు
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గిరిజనులు ఎవరూ లేరు. అయితే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీలు అధికంగా ఉన్న పంచాయతీలో ఎస్టీకి రిజర్వుకావడంతో సర్పంచ్‌ను ఎన్నుకోలేక పోతున్నాం. రిజర్వేషను మార్చాలి. – చౌదరి శంకర్, తేజపూర్‌ 

జనాభా ప్రకారం కేటాయించాలి
మా గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకున్నా సర్పంచ్‌ ఆ కేటగిరికి రిజర్వు అయింది. దీంతో మేం సర్పంచ్‌ను ఎన్నుకోలేకపోతున్నాం. గ్రామంలో ఉన్న ప్రస్తుత జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. 
– పెద్దపల్లి సంతోశ్, రహపల్లి, ఆసిఫాబాద్‌.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top