ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం | Nizamabad MP Kalvakuntla Kavitha invited for seminar of Kerala Assembly | Sakshi
Sakshi News home page

ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

Feb 5 2019 4:32 PM | Updated on Feb 5 2019 4:32 PM

Nizamabad MP Kalvakuntla Kavitha invited for seminar of Kerala Assembly - Sakshi

ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: జాతీయ స్థాయిలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ ఎంపీ కవితకు ఆహ్వాన లేఖ పంపారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం జరిగే సదస్సులో ‘‘క్యాస్ట్స్‌ అండ్‌ ఇట్స్‌ డిస్కంటెట్స్‌..’’ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కేరళ సీఎంతో పాటు దేశం లోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారు.

మాజికంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే సుమారు రెండు వేల మంది విద్యార్థులు సద స్సుకు హాజరుకానున్నారు. కేరళ అసెంబ్లీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలను గత ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ ప్రారంభించిన విష యం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా అనేక సెమినార్లు జరుగుతున్నాయి. మొదటి సెమినార్‌ గత ఏడాది ఆగస్టు 6,7,8 తేదీల్లో ‘‘ఎస్సీ,ఎస్టీల సాధికారత – సవా ళ్లు..’ అంశంపై సదస్సు జరిగింది. ఇప్పుడు రెండో సెమినార్‌ ఈనెల 23–25 వరకు జరగనుంది. యువతలో ప్రజాస్వామిక విలు వలు, జీవన విధానం, ప్రజాస్వామిక ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యం వంటి అంశాలపై ఈ సెమినార్‌లో చర్చిస్తారు. కేరళ అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు సం యుక్తంగా ఎంఐటీ–వరల్డ్‌ పీస్‌ యూనివర్శిటీ, పుణె సాంకేతిక సహకారంతో ప్రజాస్వామ్యంపై ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement