నీట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల

NEET 2019 Counselling Schedule Released - Sakshi

జూన్‌ 19 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌ : నీట్‌–2019 ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) బుధవారం (జూన్‌ 12) విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా 15 శాతం ఆలిండియా కోటా/ డీమ్డ్‌/సెంట్రల్‌ యూనివర్సిటీలు/ ఈఎస్‌ఐ, ఏఎఫ్‌ఎంఎస్‌ (ఎంబీబీఎస్‌/బీడీఎస్‌) సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసీసీ ప్రకటించిన కౌన్సెలింగ్‌ షెడ్యూలు ప్రకారం జూన్‌ 19 నుంచి మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్‌ 25న మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

మొదటి విడత కౌన్సెలింగ్‌
దరఖాస్తు ప్రక్రియ 24 వరకు కొనసాగనుంది. అనంతరం జూన్‌ 25న ఛాయిస్‌ ఫిల్లింగ్, 26న సీట్ల కేటాయింపు చేపడతారు. జూన్‌ 27న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు జూన్‌ 28 నుంచి జూలై 3లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

రెండో విడత కౌన్సెలింగ్‌... 
ఇక రెండో విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థుల నుంచి జూలై 6 – 9 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 9న మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు అదేరోజు ఛాయిస్‌ ఫిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం జూలై 10, 11 తేదీల్లో సీట్లు కేటాయించి.. 12న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు జూలై 13 – 22 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

చివరి విడత కౌన్సెలింగ్‌
చివరి విడతగా సెంట్రల్‌/ డీమ్డ్‌/ ఈఎస్‌ఐసీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల్లోగా చాయిస్‌ ఫిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17న సీట్లను కేటాయి స్తారు. 18న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటి స్తారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top