'ఉగాదికి మెట్రో రైలు సర్వీసు ప్రారంభం' | Nagole - Meetududa metro rail service starts at ugadi, says NVS Reddy | Sakshi
Sakshi News home page

'ఉగాదికి మెట్రో రైలు సర్వీసు ప్రారంభం'

Aug 1 2014 10:09 AM | Updated on Oct 16 2018 5:04 PM

'ఉగాదికి మెట్రో రైలు సర్వీసు ప్రారంభం' - Sakshi

'ఉగాదికి మెట్రో రైలు సర్వీసు ప్రారంభం'

ఉగాది పర్వదినాన మెట్రో రైలు సర్వీసును నాగోలు మెట్టగూడల మధ్య ప్రారంభిస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు పనులు వేగవంతంగా జరగుతున్నాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఉగాది పర్వదినాన మెట్రో రైలు సర్వీసును నాగోలు మెట్టగూడల మధ్య ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మెట్రో ఎండీ మీడియాతో మాట్లాడుతూ... మెట్రో ట్రయిల్ రన్ త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. మరో నాలుగు బోగీలను తెప్పిస్తున్నామని అన్నారు.

మెట్రో కోసం ఇప్పటి వరకు రూ. 4600 కోట్లు ఖర్చ చేసినట్లు వివరించారు. మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం చేసిన సూచనలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ, ఎంజీఎంల వద్ద భూగర్బ రైలు మార్గం లేనట్టే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement