తహసీల్దార్, వీఆర్‌ఓల సస్పెన్షన్ | mro, vro suspended in nizamabad distirict | Sakshi
Sakshi News home page

తహసీల్దార్, వీఆర్‌ఓల సస్పెన్షన్

Feb 28 2015 1:29 PM | Updated on Nov 6 2018 8:51 PM

రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్‌ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది.

నిజామాబాద్ : రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్‌ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో చనిపోయిన రైతుల పాసుపుస్తకాలలో ఉన్న ఫోటోలను మార్చి ఇద్దరికి  కొత్తగా పాసుపుస్తకాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆర్‌డీఓ విచారణ చేపట్టారు. దీంతో నకిలీ పాసు పుస్తకాల విషయం వెలుగులోకి వచ్చింది.
(ధర్పల్లి)

Advertisement
 
Advertisement
Advertisement