మత్స్యకారులకు ద్విచక్రవాహనాల పంపిణీ

MP Kavitha Distributed Bikes To Fisherman's At Nizamabad - Sakshi

నిజామాబాద్ : జిల్లాలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో మత్స్యకారులకు నిజామాబాద్‌ ఎంపీ కవిత ద్విచక్రవాహనాలను అందజేశారు. మరో కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమ్మద్‌ అలీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళశాలలో హాస్టల్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. బీహెచ్‌ఈఎల్‌ సహాకారంతో 3 కోట్ల నిధులతో ప్రభుత్వం హాస్టల్‌ను నిర్మించనుంది. ఈ సందర్భంగా మహమ్మద్‌ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలకు 800 ఇఫ్తార్‌ పార్టీలు ఏర్పాటు చేసిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌, మేయర్‌ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top