
'టీఆర్ఎస్ పునర్నిర్మాణమందంటే దొరల పాలనే'
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట తప్పారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట తప్పారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆదివారం నల్గొండలో మోత్కుపల్లి మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణమని టీఆర్ఎస్ అంటుందని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పునర్నిర్మాణమంటే దొరల పాలనను మళ్లీ నిర్మించడమేనని మోత్కుపల్లి పేర్కొన్నారు.