10 నుంచి 10 వేల మరణాల గ్రాఫ్‌ ఇదే!

Minister KTR Shares Coronavirus Death Toll Graph On Twitter - Sakshi

ట్విటర్‌లో షేర్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్‌ ఎంతో ముందుందని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమర్థవంతమైన లాక్‌ డౌన్‌ చర్యలతో మన దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలిగామని చెప్పారు. ఇళ్ల వద్దనే ఉంటూ, సామాజిక దూరం పాటించి వైరస్‌ విస్తరణ చైన్‌ను తెగ్గొట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. చైనా కంటే ఇటలీ, స్పెయిన్‌, యూకే, యూఎస్‌లలో కరోనా వైరస్‌ మరణాల రేటు వేగంగా ఉందని అన్నారు. ఇండియా కరోనాను ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు.
(చదవండి: నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...)

దేశవ్యాప్తంగా మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన జాన్‌ బర్న్‌ ముర్డోచ్‌ రూపొందించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు.గ్రాఫ్‌లో 10 నుంచి 10 వేల మరణాలు ఏయే దేశాల్లో ఎలా నమోదయ్యాయనే వివరాలు ఇచ్చారు. బెల్జియం, భారత్‌ అన్నిటికన్నా ముందే లాక్‌డౌన్‌ ప్రకటించాయని గ్రాఫ్‌లో పేర్కొన్నారు. కాగా, భారత్‌లో 987 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 25 మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణలో 67 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 కేసులు నమోదయ్యాయి.

మరణాలను తెలిపే గ్రాఫ్‌..


(చదవండి: ప్రకాశం జిల్లాలో ప్రమాద ఘంటికలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top