ఇటలీపై కరోనా పంజా.. మెడికల్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Italy Medical Chief Says Lockdown May Impose Again If Second Wave There - Sakshi

రోమ్‌: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19) ధాటికి అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి. దాదాపు 6 కోట్ల జనాభా ఉన్న ఈ యూరప్‌ దేశంలో 33 వేల మందికి పైగా మహమ్మారికి బలైపోయారు. ప్రాణాంతక వైరస్‌ సోకి మరణించిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహించలేని దుర్భర పరిస్థితులు ప్రజలను కలవరపెట్టాయి. ఇక ప్రస్తుతం అక్కడ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. అయితే కరోనాకు ఇంతవరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవడంతో మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉందని మిలాన్‌లోని హుమానిటస్‌ పరిశోధనాసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగం అధిపతి మౌరిజియో చెకోని హెచ్చరించారు. ప్రజలు వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని.. ఒకవేళ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగినట్లయితే మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వానికి సూచించారు. (క‌రోనా సామ‌ర్థ్యం త‌గ్గిపోయింది)

కాగా బ్రిటీష్‌- ఇటాలియన్‌ పౌరుడైన చెకోని.. లండన్‌లోని సెయింట్‌ జార్జ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో 14 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు. అతిపిన్న వయసులోనే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ కన్సల్టెంట్‌గా 2008లో నియమితులయ్యారు. ఈ క్రమంలో యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ మెడిసిన్‌ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు(హెల్త్‌కేర్‌ ఆర్మీ- దాదాపు 10 వేల స్పెషలిస్టులు ఒక్కటిగా చేర్చే సొసైటీ) చేపట్టిన చెకోని.. చైనాలో కరోనా వ్యాపించిన తొలినాళ్లలోనే యూరప్‌ దేశాలను అప్రమత్తం చేశారు. కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సహచర వైద్యులతో కలిసి పలు సూచనలు చేశారు. కరోనా సంక్షోభంతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యూరప్‌ దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా చెకోని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. (కరోనా వైరస్‌  ఇంకా ప్రాణాంతకమే  : డబ్ల్యూహెచ్‌ఓ)

అది చాలా ప్రమాదకరం
‘‘యూరోపియన్‌ వైద్యాధికారులు వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయగలరని నమ్ముతున్నాం. అయితే ట్రాన్స్‌మిషన్‌ కేసుల్లో పెరుగుదల నమోదైతే మరోసారి కఠిన నిబంధనలు విధించకతప్పదు. ఇక  ‘సామూహిక రోగ నిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ- జనాభాలో దాదాపు70% మంది ఆ వ్యాధిన పడి కోలుకుంటే ఇది సాధ్యమవుతుంది) వ్యూహమనేది ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే కరోనాకు ఇంతవరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు బలహీనవర్గాలకు వైరస్‌ సోకకుండా చూసుకోవడమే మన ముందున్న మార్గం’’ అని చెకోని చెప్పుకొచ్చారు.

అత్యవసరంగా సమావేశమయ్యాం
ఇక కరోనా వ్యాపించిన తొలినాళ్ల గురించి చెకోని మాట్లాడుతూ.. ముప్పయేళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడని.. కొన్ని రోజుల తర్వాత అతడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి అతడికి చికిత్స అందించడంతో పాటుగా.. వైరస్‌ వ్యాప్తి గురించి అధికార వర్గాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. లాంబార్డీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వైరస్‌ తీవ్రత గురించి చర్చించామన్నారు. అనంతరం వెంటనే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్ల సామర్థ్యం పెంచడంతో పాటుగా.. వెంటిలేటర్లు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా స్థానిక ఆస్పత్రులకు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. 

రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి
కాగా కరోనా పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో హెల్త్‌వర్కర్లు ఎంతో కఠినశ్రమకోర్చారన్న చెకోని.. పీపీఈ ధరించడం, తొలగించడం వారికి అన్నిటికంటే పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. అయినప్పటికీ రోజుల తరబడి రోగులకు సేవలు చేస్తూ.. ఇంటికి దూరంగా ఉంటూ అంకితభావాన్ని కనబరిచారని కొనియాడారు. కరోనా సృష్టించిన కల్లోలాన్ని తలచుకుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయని.. ఎన్నెన్నో హృదయవిదారక ఘటనలకు మహమ్మారి కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేసుకున్నారు. ప్రాణాంతక వైరస్‌ ఎప్పుడు చనిపోతామో తెలియక రోగులు అల్లాడుతుంటే.. ఓ పక్క వారికి ధైర్యం చెబుతూ... మరోపక్క వారి కుటుంబ సభ్యులను సముదాయిస్తూ అనేక మంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రజలకు తామున్నామనే భరోసా ఇచ్చారంటూ ప్రశంసలు కురిపించారు.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

13-07-2020
Jul 13, 2020, 14:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ...
13-07-2020
Jul 13, 2020, 14:04 IST
ప‌ట్నా: ఏమాత్రం అజాగ్ర‌త్తప‌డ్డా మ‌నుషుల్ని పీడించేందుకు క‌రోనా ర‌క్క‌సి సిద్ధంగా ఉంటుంది. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం కూడా క‌రోనాకు మ‌రింత చేరువ...
13-07-2020
Jul 13, 2020, 13:16 IST
సాక్షి, ముంబై : విలక్షణ నటుడు సోనూ సూద్‌ (46) మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌...
13-07-2020
Jul 13, 2020, 13:03 IST
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు....
13-07-2020
Jul 13, 2020, 12:24 IST
కోవిడ్‌ కారణంగా వీధి వ్యాపారుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది..రెక్కాడితే గానీ డొక్కాడని వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం జగనన్న తోడు...
13-07-2020
Jul 13, 2020, 11:47 IST
జైపూర్‌: ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌...
13-07-2020
Jul 13, 2020, 09:35 IST
కరోనా జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.కరోనా నియంత్రణ విధులు నిర్వహించే పోలీస్‌ విభాగంలోనూ కలకలం సృష్టిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 07:34 IST
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత నాలుగు నెలలతో పోలిస్తే.. ప్రస్తుతం వైరస్‌ రాకెట్‌ వేగంతో విస్తరిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 06:59 IST
ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క...
13-07-2020
Jul 13, 2020, 04:22 IST
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా...
13-07-2020
Jul 13, 2020, 03:57 IST
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు...
13-07-2020
Jul 13, 2020, 03:35 IST
సాక్షి, అమరావతి : ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో భాగంగా సర్కారు మరింత వేగాన్ని పెంచింది. ఏఎన్‌ఎంల ద్వారా...
13-07-2020
Jul 13, 2020, 03:33 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు. అమెరికాలో కరోనా వైరస్‌ ప్రబలంగా ఉన్న సమయంలోనూ మాస్క్‌...
13-07-2020
Jul 13, 2020, 03:31 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,000 మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లోఆస్పత్రుల...
13-07-2020
Jul 13, 2020, 03:25 IST
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడి జీజీహెచ్‌లో చికిత్స పొందారు. 14 రోజులు...
13-07-2020
Jul 13, 2020, 03:24 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి....
13-07-2020
Jul 13, 2020, 03:11 IST
మాస్కో: కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు చీకట్లో చిరుదీపంలా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే...
13-07-2020
Jul 13, 2020, 02:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై...
12-07-2020
Jul 12, 2020, 19:29 IST
ముంబై :  బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం అమితాబ్‌, ఆయన తనయుడు...
12-07-2020
Jul 12, 2020, 16:55 IST
లండన్‌: ఒక ఔష‌ధాన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ముందుగా దాన్ని ప్ర‌యోగించాలి. ఆ ప్ర‌యోగం స‌ఫ‌ల‌మైతేనే అది మార్కెట్లోకి వ‌చ్చేది.. లేక‌పోతే దాన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top