మహాజాతర ఆదాయం రూ. పది కోట్ల పైనే..

medaram jathara income Rs. Over ten crore - Sakshi

47 కిలోల వెండి,824 గ్రాముల బంగారం  

గత జాతర కంటే పెరిగిన ఆదాయం

హన్మకొండ కల్చరల్‌: మేడారం మహాజాతర ఆదాయం రూ.10,17,50,363గా నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద పెట్టిన 452 ఇనుపరేకు హుండీలు, 24 వస్త్ర హుం డీలు, 3 ఒడిబాల బియ్యం హుండీలను ఏ ర్పాటు చేశారు. వాటిని ఫిబ్రవరి 5న హన్మకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపంలోకి చేర్చారు.

అ నంతరం ఆరో తేదీన లెక్కింపు మొదలు పెట్ట గా.. సోమవారం ముగిసింది. మొత్తం జాతర ఆదాయం రూ.10,17,50,363 వచ్చింది. వాటిని ఆంధ్రా బ్యాంక్‌ నక్కలగుట్ట బ్రాంచ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో జమ చేసినట్లు దేవాదాయశాఖ 5వ జోన్‌ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు. వందలాది అమెరికన్‌ డాలర్లతోపాటు సుమారు 32 దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు వివరించారు.

అలాగే, 47 కిలోల 470 గ్రాముల వెండి, బంగారు బిస్కెట్లు, బంగారు కిడ్నీ రూపాలు, బంగారు బాసింగాలు, మూడంతస్తుల బంగారు ఇల్లు వంటి వాటిని కూడా కలుపుకొని మొత్తం 824 గ్రాముల బంగారాన్ని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు వెల్లడించారు. కాగా, గత జాతరలో 8.90 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ జాతరలో రూ. కోటికి పైగా ఆదాయం పెరిగింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top