రోడ్డు దాటుతూ వ్యక్తి మృతి | man dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు దాటుతూ వ్యక్తి మృతి

Aug 8 2015 7:23 PM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని 'వై' జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని 'వై' జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం సాయంత్రం లింగ్యానాయక్ (35) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతణ్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుణ్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్రా తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement