నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలో కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలో కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. మండలంలోని బాలంపల్లిలో గ్రామానికి చెందిన కాశపాక మల్లేశ్(45)తో పాటు మరో నలుగురు మంగళవారం సాయంత్రం కల్లు తాగారు. అనంతరం వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతే బుధవారం ఉదయం మల్లేశ్ మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.
(భువనగిరి)