సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం 

Malla Reddy Engineering College Donated 25 Lakhs To CM Relief Fund - Sakshi

మంత్రి కేటీఆర్‌కు చెక్కులు అందజేసిన దాతలు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శనివారం సుమారు 30 మంది దాతలు రూ.4.70 కోట్ల చెక్కులను మంత్రి కేటీఆర్‌కు ప్రగతిభవన్‌లో అందజేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.50 లక్షలు, మల్లారెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన మరో రూ.47 లక్షలు విలువ చేసే 36 చెక్కులను కేటీఆర్‌కు అందజేశారు. వీటితో పాటు మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ తరపున మరో రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. 
► హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ఎండీ ఐవీఆర్‌ కృష్ణంరాజు రూ.50 లక్షలు, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.40 లక్షలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద కేటీఆర్‌కు అందజేశారు. వోక్సెన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఎండీ విన్‌ పూల, రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఆర్‌ఏ కెమ్‌ ఫార్మా లిమిటెడ్, ఎన్‌.ఎస్‌. ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్‌ఎంఆర్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. 
► ఆజాద్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 21 లక్షలు, అక్యురేట్‌ గ్రీన్‌ వీడియోస్‌ రూ.15 లక్షలు, స్కైస్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ రూ.11 లక్షలు, సూర్యాపేట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యుగంధర్‌ రావు రూ.10 లక్షలు, మర్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ తరపున టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి రూ.10 లక్షలు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, సెయింట్‌ మార్టిస్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, టెక్‌ సిస్టమ్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 లక్షల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.  
► పడాల రామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.6 లక్షలు, లహరి ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మరిస్టా ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్‌ లిమిటెడ్, జోగినిపల్లి చంద్రశేఖరరావు, జోగినిపల్లి సుధీర్‌ రూ. 5 లక్షల చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌కి విరాళంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్‌ సెయింట్‌ అన్నె రూ.5 లక్షల చెక్కులను కేటీఆర్‌కు అందజేసింది. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.రాజేశంగౌడ్‌ రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top