నేటి ముఖ్యాంశాలు..

Major Events On 26th March - Sakshi

తెలంగాణ:
► నేటి నుంచి రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ మొదలుకానుంది. 

ఆంధ్రప్రదేశ్‌:
► నేటి నుంచి మూడురోజులపాటు తిరుమలలో ధన్వంతరి యాగం
► కృష్ణా జిల్లాలో నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న రైతు బజార్లు
► ఏపీవ్యాప్తంగా మరోసారి కొనసాగుతున్న సమగ్ర సర్వే. ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు. విదేశాల నుంచి వచ్చినవారు, సన్నిహితంగా ఉన్నవారి వివరాల సేకరణ

జాతీయం: 
►  నేడు జీ-20 దేశాల అత్యవసర సమావేశం. కరోనా నివారణ చర్యలపై సమీక్షించనున్న జీ-20 దేశాలు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జీ-20  సమావేశంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ
►  భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 657కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 12 మంది మృతి చెందారు. 43 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అంతర్జాతీయ:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 21,191కి చేరింది.
► కరోనా బాధితుల సంఖ్య 4.68 లక్షలు దాటింది.
► కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 1,14,218 మంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top