ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఓ ప్రేమికుడు తన ప్రియురాలిపై యాసిడ్ దాడి చేశాడు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఓ ప్రేమికుడు తన ప్రియురాలిపై యాసిడ్ దాడి చేశాడు. పెళ్లి చేసుకుందామని ప్రియుడు ప్రతిపాదించడం, ఆమె పదే పదే జాప్యం చేస్తుండటంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన హంస అనే అమ్మాయికి.. కడెం మండలానికి చెందిన మునీర్ అనే యువకుడితో 2009 సంవత్సరం నుంచి పరిచయం ఉంది. అతడు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మునీర్ నిర్మల్ పట్టణానికి వచ్చాడు. హంసను బస్టాండు సమీపానికి పిలిచాడు. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో ఆగ్రహానికి గురైన మునీర్.. తన బ్యాగులో పెట్టుకుని తెచ్చిన యాసిడ్ సీసా తీసి ఆమెపై పోశాడు. తీవ్రగాయాలకు గురైన హంసను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.