అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన లారీ | load lorry slipped at polytechnic college in medak | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన లారీ

Feb 17 2016 5:35 PM | Updated on Sep 29 2018 5:26 PM

మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆంధోల్ గ్రామ శివారులో బుధవారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆంధోల్ గ్రామ శివారులో బుధవారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆంధోల్ శివారులో బాలికల పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన కంకర లోడ్ తో ఉదయం ఓ లారీ అక్కడికి చేరుకుంది.

కంకరను కిందికి డంప్ చేసే క్రమంలో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే కిందికి దూకేశాడు. గుంతలో పడిన లారీ బాడీ అంతా ముక్కలు ముక్కలయింది. అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement