సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల | List of nominated candidates for civil services training | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

Sep 30 2017 4:04 AM | Updated on Sep 30 2017 4:04 AM

List of nominated candidates for civil services training

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌–2018 శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌.లక్ష్మణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు  http://studycircle.cgg.gov.in/tstw వెబ్‌సైట్‌లో జాబితాను చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్‌ 3న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం హిమాయత్‌ సాగర్‌ రోడ్‌లోని మానస హిల్స్‌ వైటీసీలో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. శిక్షణా తరగతులు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇతర వివరాలకు 040–27540104, 7799886980, 8522914704 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement