హైదరాబాద్‌లో లగడపాటి విగ్రహం పెట్టాలి | Lagadapati Rajagopal statue to install at Hyderabad, says Venkata Narayana | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో లగడపాటి విగ్రహం పెట్టాలి

Jan 28 2015 1:03 AM | Updated on Sep 2 2017 8:21 PM

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చరిత్రను భావితరాలకు తెలిపేందుకు..

 కేసీఆర్‌కు జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వినతి
 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చరిత్రను భావితరాలకు తెలిపేందుకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మంగళవారం ఆయన  సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తాను గాంధేయవాదినని చెప్పుకుంటూ తిరిగే లగడపాటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరిచిపోలేని విధంగా పార్లమెంటులో తెలంగాణవాదులపై దాడి చేసి బిల్లును అడ్డుకున్నాడని వివరించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న లగడపాటిని తెలంగాణ ప్రజలు మరువకుండా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అతని ఘన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement