27 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు | ktr tour in districts from 27 | Sakshi
Sakshi News home page

27 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు

Jan 25 2015 1:02 PM | Updated on Mar 9 2019 4:19 PM

27 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు - Sakshi

27 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు

వాటర్ గ్రిడ్ పనుల పర్యవేక్షణ కోసం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు.

హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పనుల పర్యవేక్షణ కోసం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను కేటీఆర్ విడుదల చేశారు. 27న మహబూబ్ నగర్ లో, 28న వరంగల్ లో, 29న ఖమ్మంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా..ఫిబ్రవరి 10 వ తేదీలోగా నల్గొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ పైలాన్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పైలాన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరిస్తారన్నారు.

 

దీనికి సంబంధించి జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ పథకంపై కేటీఆర్ సమీక్షలు నిర్వహించనున్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని,  జిల్లాల అధికారులందరూ పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని కేటీఆర్ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement