వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలవుతున్నాయి.
వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఉత్సవాలు కావడంతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐనవోలులో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి శనివారం రాత్రి వరంగల్‌కు చేరుకున్నారు. దీంతో కేసీఆర్ మరొక రోజు జిల్లాలోనే ఉండే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతుఆన్నయి. కేసీఆర్ ఆది వారం లేదా సోమవారం వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి, ఐనవోలు ఉత్సవాలకు వెళ్తారని తెలుస్తోంది. ఆదివారం ఉదయం భద్రకాళి ఆలయూనికి వెళ్తున్నారు.