మోదీ జీతాగాడా.. రాహుల్‌ మనిషా..! | KCR Fear To Elections Says Revanth Reddy | Sakshi
Sakshi News home page

మోదీ జీతాగాడా.. రాహుల్‌ మనిషా..!

Oct 7 2018 8:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

KCR Fear To Elections Says Revanth Reddy - Sakshi

రేవంత్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటో)

తెలంగాణకు పట్టిన పీడవిరగడ అవ్వడానికే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారు..

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళ వద్ద మొకరిల్లారని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా నెరవేర్చని టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయ్యాలని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఖుత్బుల్లాపూర్‌లో జరిగిన మైనార్టీ సభలో రేవంత్‌ ప్రసంగిస్తూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తాగి రాష్ట్రాన్ని నడుతున్న కేసీఆర్‌ను అండమాన్‌ జైల్‌ల్లో పెటాల్సిన బాధ్యత పోలీస్‌లపై లేదా? అని అన్నారు.

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తెలంగాణ సెంటిమెంట్‌ రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు పేరుని తెరమీదకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన పీడవిరగడ అవ్వడానికే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను సాగనంపేందుకు ఇంటికి ఒక్కరు యుద్ధానికి సిద్ధమై బయటకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రానికి సీఎంగా పాస్‌పోర్టు బ్రోకర్‌ ఉండాలా లేక.. కాంగ్రెస్‌ నాయకుడు ఉండాలా. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి మోదీ జీతాగాడు సీఎంగా ఉండాలా లేక.. రాహుల్‌ మనిషి ఉండాలా’’ అని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement