డిగ్రీ ప్రశ్నపత్రాలు లీక్ | Kakatiya University Distance Education Degree prasnapatralu leak | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రశ్నపత్రాలు లీక్

Jul 19 2014 1:06 AM | Updated on Sep 2 2017 10:29 AM

కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే సమాచారంతో అధికారులు శుక్రవారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను నిరవధికంగా వాయిదా వేశారు.

హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే సమాచారంతో అధికారులు శుక్రవారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను నిరవధికంగా వాయిదా వేశారు. దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం తదితర పరీక్షలు ఈనెల 16నుంచి ప్రారంభమై 97 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 

శుక్రవారం జరగాల్సిన బీకాం టాక్సేషన్ ప్రశ్నాపత్రాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి గురువారం రాత్రి పరీక్షల నియంత్రణాధికారి ఎంవీ రంగారావుకు మెరుుల్ చేశాడు. అది..పరీక్షల విభాగంలోని ప్రశ్నపత్రం ఒకే విధంగా ఉండడంతో పేపర్ లీకైనట్టు గ్రహించారు. వర్సిటీ ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్ వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్‌చార్జి వీసీ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.  ఈ పేపర్లు  హైదరాబాద్‌లో  లీక్ అయినట్లు తెలుస్తోంది.
 

Advertisement

పోల్

Advertisement