కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!

Janapriya Chairman Ravinder Reddy Interview About Home Maintenance Charges - Sakshi

ఇకపై ఇళ్లలో కూడా ఆఫీస్‌ స్పేస్‌ ఉంటుంది 

ఇంటర్నెట్, సీటింగ్‌ వంటి వసతులూ ఉండాలి

రూ.40 లక్షల లోపు గృహాలకు డిమాండ్‌ ఎక్కువ 

‘సాక్షి’తో జనప్రియ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి 

ఆహారం... ఆవాసం... ఆహార్యం... మనిషికి ఈ మూడూ ఎప్పుడూ తప్పనిసరే. కరోనా నేపథ్యంలో ఆయా రంగాల్లో ఏర్పడ్డ అనిశ్చితి తాత్కాలికమేనని... అది నేర్పిన పాఠంతో జనమంతా ఆహారం, వైద్య అవసరాల తర్వాత ఖర్చు పెట్టేది ఇళ్ల మీదేనని చెప్పారు జనప్రియ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి. రియల్టీ రంగంలో తాజా పరిస్థితులు, భవిష్యత్‌ను ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ఇంటర్వూ్యలో ప్రత్యేకంగా పంచుకున్నారాయన.

సాక్షి, హైదరాబాద్: నిజం చెప్పాలంటే రెసిడెన్షియల్‌ విభాగంలో కూడా కరోనాకు ముందు.. తర్వాత.. అనే విభజన తప్పనిసరి. కరోనా ప్రభావంతో రిటైల్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి రంగాల్లో ఉద్యో గాల కోత ఉంది. దీంతో గృహ కొనుగోలుదారు ల సంఖ్య తగ్గుతుంది. లాక్‌డౌన్‌ సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు క్రమంగా సాధారణ జీవనంలోకి వస్తున్నారు. వచ్చే 3–4 నెలలూ... గతంలో మా దిరి ఖర్చులు చేయరు. తిండి, విద్య, వైద్యం గు రించి సేవింగ్స్‌ చేస్తారు. ఆ తర్వాత కావాల్సింది ఇల్లు. రియల్టీ మార్కెట్‌ జోష్‌లో ఉన్నప్పుడు అం దరూ కొంటారు. డిమాండ్‌ ఉంటుంది కనుక ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఇలాం టి అనిశ్చితి పరిస్థితుల్లో ఇళ్లు కొనడమే మంచిది. డెవలపర్లతో బేరం ఆడొచ్చు. నగదు లభ్యత కోసం డెవలపర్లు కూడా మార్జిన్లను తగ్గించుకొని విక్రయించే అవకాశం ఉంటుంది. (కరోనాకు ప్రైవేట్‌ వైద్యం)

భవిష్యత్‌లో గృహ నిర్మాణాలు ఎలా? 
కరోనా భయంతో గతంలో మాదిరిగా సినిమాల కు, షికార్లకు విచ్చలవిడిగా వెళ్లరు. ఇంట్లో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది కనుక కొత్తగా చేపట్టే ఇళ్ల నిర్మాణాలు కూడా అందుకు తగ్గట్టుగా మార్చాలి. గతంలో నలుగురు సభ్యులున్న కు టుంబానికి టూ బీహెచ్‌కే సరిపోయేది. భవిష్య త్‌లో కష్టం. ఇంట్లో గడిపే సమయం పెరగడం, ఆఫీస్‌ పని కూడా ఇంట్లోనే చేస్తుండటంతో ఇంటి విస్తీర్ణం కూడా పెరగాలి. ప్రైవసీ, ప్రశాంత వాతా వరణం, వర్క్‌ చేసుకునేందుకు ఇంటర్నెట్, సీటిం గ్, డెస్క్‌ వంటి ఆఫీస్‌ స్పేస్‌ వసతులూ ఇంట్లోనే కల్పించాల్సి ఉంటుంది. గతంలో 750 చదరపు అడుగుల్లో కూడా నిర్మించే టూ బీహెచ్‌కేలకు ఇకపై మరో 100 చ.అ. ఎక్కువ కావాలి. (అన్నదాతకు..భరోసా కేంద్రాలు)

గృహ కొనుగోలుదారుల అభిరుచులు..?  
కరోనాతో ప్రజలకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. నగరం నడిమధ్యలో కాకుండా శివారు ప్రాంతాల కు, పచ్చని పరిసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ప్రజా రవాణా సౌకర్యాలుండే శివారు ప్రాం తాలలో ఇళ్లను ఎంచుకోవచ్చు. కార్యాలయాలకు దగ్గరగా ఉండాలని భావించే వాళ్లు.. వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రాజెక్ట్‌లకు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు ప్రాధాన్యమిస్తారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే షాపింగ్‌ మాల్స్, థియేటర్స్‌ వంటి వాణిజ్య ప్రాంతాల్లో కాకుండా హై స్ట్రీట్‌ మార్కెట్ల వైపు జనం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 

ఇళ్ల రేట్లు ఏమైనా తగ్గుతాయా? 
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి, కొత్తగా ప్రారంభమయ్యే ప్రాజెక్ట్‌లలో ధరలు తగ్గకపోవచ్చు. ఎం దుకంటే నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నా యి. కూలీల కొరత కూడా ఉంది. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాకపోతే ఇప్పటికే పూర్త యి అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) ధరలు కొంత తగ్గొచ్చు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య సంప్రదింపుల మేరకు ఈ ధరలుంటాయి. గతంలో రూ.50–60 లక్షలు పెట్టి ఇల్లు కొందామనుకున్న వాళ్లు ఇప్పుడు రూ.40 లక్షల లోపు బడ్జెట్‌ పెడతారు. హైదరాబాద్‌లో రూ.35–40 లక్షల గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top