మధ్య వేలికి సిరా గుర్తు

Ink on middle finger for panchayat raj elections - Sakshi

అసెంబ్లీ ఎన్నికల గుర్తు చెరగక పోవడంతో మధ్య వేలికి 

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చే ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్కతో గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల్లో ఒకసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు మళ్లీ ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వస్తే గుర్తించి నిలువరించేందుకు ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్కతో గుర్తు పెట్టాలని ఎన్నికల నిబంధనలు పేర్కొంటున్నాయి. చట్ట సభలకు ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ఒకే తరహా పద్ధతిని అనుసరిస్తున్నాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టిన సిరా గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినపుడు ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న చెరగని సిరా గుర్తు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చే వారి ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్కతో గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top