తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి | Honey bees kill man | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

Mar 1 2016 3:23 PM | Updated on Sep 3 2017 6:46 PM

గుడికి వెళ్లిన ఓ కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కుటుంబ సభ్యులంతా గాయపడగా ఓ వృద్ధుడు మృతి చెందాడు.

మేడిపల్లి (కరీంనగర్) : గుడికి వెళ్లిన ఓ కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడగా వారిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం భీమారం ఎల్లమ్మ గుడి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుడికి వెళ్లిన కుటుంబసభ్యులు తేనెటీగల దాడిలో గాయపడ్డారు. వారిలో నారాయణ అనే వృద్ధుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement