
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆకస్మిక బదిలీ అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోం దని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గౌతమ్‌కుమార్‌ను, ఇప్పుడు జనార్దన్‌రెడ్డిని అదే తరహాలో బదిలీ చేయడం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే అధికారులను ప్రభు త్వం బదిలీ చేయడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.