ఉభయ రాష్ట్రాల్లో ప్రవహి స్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు, వాటి ఉపనదులను
నదులను ప్రాణమున్న జీవులుగా గుర్తించాలన్న పిల్‌పై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో ప్రవహి స్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు, వాటి ఉపనదులను ప్రాణ మున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహా రంపై మీ వైఖరేంటో తెలుపుతూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర నీటి వనరులశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పర్యావరణశాఖల ముఖ్య కార్యదర్శులు, పీసీబీ సభ్యకార్య దర్శులకు నోటీసులిచ్చింది.
తదుపరి విచా రణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ టి.రజనీతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. మనుషులకు ఉండే అన్ని చట్టబద్ధమైన హక్కులనూ నదులకు కల్పించాలని కోరుతూ న్యాయ విద్యార్థిని ఉన్నం దీప్యాచౌదరీ వేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.
ఆ ఆదేశాలు మేమెలా ఇవ్వగలం..!
పిటిషనర్ తరఫు న్యాయవాది మురళీధర రావు వాదనలు వినిపిస్తూ.. నదులను పరి రక్షించే వ్యవస్థ ఏదీ లేదని, ఉన్న వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని తెలిపారు. కనుక నదులను ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ధర్మాస నం స్పందిస్తూ, అటువంటి ఆదేశాలు తామె లా ఇవ్వగలమని ప్రశ్నించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఈమేరకు ‘చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిందని మురళి బదులిచ్చారు.