కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా? 

Hen Laid the Two Eggs At A time In Itikyal, Jogulamba Gadwal - Sakshi

సాక్షి, ఇటిక్యాల (అలంపూర్‌) : ఎక్కడైనా ఒక కోడిపెట్ట గుడ్డు పెట్టిన తర్వాత 24 గంటలకు మరో గుడ్డు పెడుతుంది. కానీ మండల కేంద్రంలోని హుస్సేన్‌కు చెందిన ఓ కోడిపెట్ట శనివారం ఒకే సమయంలో రెండు గుడ్లు పెట్టింది. ఒకటి సాధారణ సైజులో ఉండగా.. మరొకటి చిన్నసైజులో ఉంది. ఒకే సమయంలో కోడి రెండు గుడ్లను, అది ఒకటి చిన్నదిగా, మరొకటి సాధారణ సైజులో పెట్టడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై పశువైద్యాధికారి రమేష్‌ను సంప్రదించగా.. ఇది అరుదైన సంఘటన అని, జన్యులోపంతో ఇలాంటివి జరుగుతాయన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top