కొండగట్టుకు పోటెత్తిన భక్తులు | heavy crowd at konda gattu | Sakshi
Sakshi News home page

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

Apr 5 2015 11:13 PM | Updated on Sep 2 2017 11:54 PM

కరీంనగర్ జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఆదివారం ఉదయం దీక్షాపరులతో కాషాయవర్ణం సంతరించుకుంది.

మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఆదివారం ఉదయం దీక్షాపరులతో కాషాయవర్ణం సంతరించుకుంది. శనివారం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు ఆలయూన్ని మూసివేశారు. దీంతో ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. తెల్లవారుజామున పుష్కరిణిలో వేలాదిమంది ఒకేసారి స్నానమాచరించేందుకు రావడంతో స్వల్నంగా తొక్కిసలాట జరిగింది.

 

మాల విమరణ చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. పోలీసులు బందోబస్తు నిర్వహించి, కోనేరు సమీపంలోని మెట్లపై క్యూలో కూర్చోబెట్టి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement